శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మే 2024 (20:35 IST)

84 యేళ్ళ వయసులో 8వ తరగతి పరీక్ష రాసిన ప్రఖ్యాత వైద్యుడు!!

prakash indian tata
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 84 యేళ్ళ వయుస్సున్న ప్రముఖ వైద్యుడు ఎనిమిదో తరగతి పరీక్షలు రాసి రికార్డులెక్కారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్‌వాడాకు చెందిన ప్రకాశ్ ఇండియన్ టాటా ఆయుర్వేద వైద్యుడు. విద్యాజ్ఞానం అస్సలు లేకపోవడంతో తొలుత మధ్యప్రదేశ్ ఓపెన్ వద్ద బోర్డు నుంచి ఐదో తరగతి పరీక్ష రాశారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. 
 
ఆయన సాధారణ ఆయుర్వేద వైద్యుడేమీ కాదు. ఆయనకు ఎంతో మంది పేరుంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, శిల్పాశెట్టి సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎంతో మంది విదేశీ వ్యాపారవేత్తలు సేవలు అందించారు. మొత్తం 112 దేశాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు కూడా ఆయుర్వేద వైద్యం చేశారు. ప్రస్తుతం 8వ తరగతి పరీక్షలు రాస్తున్న ఆయనను చూసిన విద్యార్థులు నోరెళ్లబెడుతున్నారు.