మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (09:47 IST)

నైట్ డ్యూటీకి మందేసి.. లుంగీతో వచ్చిన డాక్టర్

పేషెంట్ల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడిగా పనిచేసిన అతడు బాధ్యతాయుతంగా వ్యవహరించాడు. ఈ ఘటన తమిళనాడులోని, తిరువైయారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, తిరువైయార్ ప్రభుత్వాసుపత్రిలో గత రెండు రోజుల క్రితం రాత్రి డ్యూటీకి వచ్చిన డాక్టర్ మహబూబ్ బాషా.. ఫూటుగా మందేసి వచ్చాడు.
 
ఆస్పత్రికి వచ్చిన అతడు నేరుగా బెడ్ మీద పడిపోయాడు. ఆ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి రావడంతో నర్సులు ఎంత లేపినా, లేవకపోవడానికి తోడు.. హ్యాపీగా లుంగీతో నిద్రపోయాడు. 
 
ఈ ఘటనపై డైరక్టరేట్‌కు సమాచారం అందించడం జరిగింది. ఆపై ప్రాణాపాయ స్థితిలో వచ్చిన పేషెంట్లకు వేరు డాక్టర్ల నుంచి చికిత్స అందించడం జరిగింది. ఇంకా డ్యూటీ టైమ్‌లో తప్పతాగి హంగామా చేసిన డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.