శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: ఆదివారం, 28 అక్టోబరు 2018 (18:30 IST)

నీకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు... పోలీసుపై మందుబాబు వీరంగం

మత్తెక్కిన మైకంలో మందుబాబులు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద అర్థరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ మందుబాబులు  పోలీసులపై బూతు పురాణం మొదటుపెట్టారు. 
 
ఇంగ్లీష్ మాట్లాడ్డమే రాదు.. పోలీసు ఉద్యోగం ఎలా వచ్చింది. తనీఖీలు చేయడం కాదు... నాతో ఇంగ్లీష్‌లో మాట్లాడు అంటూ గొడవపడ్డాడు నితీష్ అనే మందుబాబు. ఇక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను చూసి కారు డ్రైవింగ్ సీట్లోంచి దిగి వెనుకసీట్లో కూర్చొన్న మరో మందుబాబును పోలీసులు పట్టుకుని బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా.. 120 పాయింట్ల ఆల్కహాల్ మోతాదు చూపించింది. 
 
దీంతో తన కారు సీజ్ చేయనివ్వనంటూ పోలీసులకు తన వివరాలు చెప్పేందుకు నిరాకరించాడు సదరు వ్యక్తి. చివరికి పోలీసులు  క్రేన్ సహాయంతో కారును తీసుకెళ్లడానికి సిద్ధపడటంతో చేసేదేమీ లేక కారు తాళాలు పోలీసులకు అప్పగించాడు మందుబాబు.