సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 24 మార్చి 2021 (16:00 IST)

చేనుకి నీళ్లు పెడుతున్న రైతులపైకి అమాంతం దూకిన చిరుతపులి

ఇటీవలి కాలంలో వన్యమృగాలు అడవులను వదిలి ఊళ్లపై పడుతున్నాయి. తెలంగాణలో ఆమధ్య పెద్దపులి ఇద్దర్ని పొట్టనపెట్టుకుంది. కర్నాటకలోనూ చిరుతపులుల దాడులు ఎక్కువయ్యాయి. తాజాగా ఓ చిరుతపులి చేను నీళ్లు పెట్టుకుంటున్న రైతులపై మెరుపుదాడి చేసింది.
 
కర్నాటక రాష్ట్రంలోని హవేరి జిల్లా బులపురలో గాడిగెప్ప, క్రిష్ణప్ప అనే ఇద్దరు రైతులు వేకువజామున 3 గంటలకు పొలంకి నీరు పెట్టేందుకు వెళ్లారు. వారు నీళ్లు పెడుతున్న సమయంలో వెనుక నుంచి హఠాత్తుగా ఇద్దరి రైతులపైకి దూకి దాడి చేసింది. చిరుత నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు రైతులు తీవ్రంగా పోరాడారు.
 
పక్కనే వున్న పెద్ద బండరాయితో చిరుతపై దాడి చేసి హతమార్చారు. చిరుత దాడిలో గాడిగెప్పకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని చిత్రదుర్గ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రిష్ణప్పకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా వేసవి కావడంతో వన్యప్రాణులు ఊళ్లవైపు వచ్చే అవకాశం వుందనీ, అటవీ ప్రాంతాలకు సమీపంలో వున్న ప్రజలు అప్రమత్తంగా వుండాలని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మంచినీటి కోసం జంతువులు రావచ్చనీ, ఊరి బయట జంతువులకు నీటి తొట్టెలను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు.