నిండు గర్భిణికి కరోనా పాజిటివ్.. ఎలా సంక్రమించిందంటే?

Coronavirus: Will this virus spread if you touch China goods
కరోనా వైరెస్
సెల్వి| Last Updated: శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (12:41 IST)
దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో.. నిండు గర్భిణికి కరోనా పాజిటివ్ కేసు నమోదైన సంఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పని చేస్తున్న ఓ వైద్యుడికి కరోనా సోకింది. ఆయన ఎయిమ్స్‌లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వారి ద్వారా ఆయనకు కరోనా సంక్రమించింది. అయితే ఆయన ద్వారా తొమ్మిది నెలల గర్భిణి అయిన ఆయన భార్యకూ కరోనా సోకినట్లు తెలింది.

ముందుగా వైద్యుడికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ముందస్తు జాగ్రత్తగా ఆయన భార్యకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. టెస్టుల్లో తొమ్మిది నెలల గర్భవతి అయిన ఆమెకు కూడా పాజిటివ్‌ అని తేలింది, దీంతో ఇద్దరికీ వైద్య చికిత్సలు అందజేస్తున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. వైరస్ కేసుల సంఖ్య పెరగడానికి నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలు ప్రధాన కారణమయిన సంగతి తెలిసిందే.దీనిపై మరింత చదవండి :