శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 3 జూన్ 2018 (16:29 IST)

గోవిందా స్టైల్ అంకుల్ డ్యాన్స్ వైరల్.. శివరాజ్ సింగ్ చౌహాన్ ఫిదా.. శ్రీవాత్సవ ఖుషీ

మధ్యప్రదేశ్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాత్సవ (46) డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన బావమరిది వివాహ వేడుకలో భాగంగా, సంగీత్‌లో ''ఆప్ కీ ఆజానే సే'' అనే 1987 నాటి

మధ్యప్రదేశ్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాత్సవ (46) డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన బావమరిది వివాహ వేడుకలో భాగంగా, సంగీత్‌లో ''ఆప్ కీ ఆజానే సే'' అనే 1987 నాటి ''ఖుద్ గర్జ్'' చిత్రంలోని గోవిందా పాటకు డ్యాన్స్ చేశారు.


ఈ వీడియో వైరల్ కావడంతో సంజీవ్ సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. మే 12న ఈ వీడియోను షూట్ చేశారని చెప్పిన సంజీవ్, తనకు ఇంత గుర్తింపు వస్తుందని అనుకోలేదన్నారు. తన భార్య అంజలితో కలసి స్టేజ్ పై డ్యాన్స్ చేశానని తెలిపారు. 
 
అంతేగాకుండా తన డ్యాన్స్‌కు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఫిదా అవడాన్ని తాను జీవితంలో మరువలేనని.. ట్విట్టర్లో తన నృత్యాన్ని చూసిన ఆయన.. మధ్యప్రదేశ్ నీటిలోనే ఏదో ప్రత్యేక వుందని వ్యాఖ్యానించడాన్ని గుర్తు చేశారు.

గత రెండు రోజులుగా తన ఫోన్ రింగ్ అవుతూనే ఉందని, గంట వ్యవధిలో తాను 100 కాల్స్ మాట్లాడాల్సి వచ్చిందని, మీడియా తన ఇంటర్వ్యూలు, ఫొటోల కోసం వస్తోందని, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి సైతం ఫోన్ చేసి అభినందించారన్నారు.