గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (10:51 IST)

రెండోసారి కూడా ఆదిత్యం ఎల్-1 కక్ష్య పెంపు విన్యాసం సక్సెస్

adity L-1
సూర్యుడి గుట్టును ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్యం ఎల్-1 రాకెట్ ప్రయోగ పరీక్ష విజయవంతంగా సాగుతోంది. ఇందులోభాగంగా, ఈ రాకెట్ కక్ష్య పెంపు విన్యాసం రెండోసారి కూడా విజయంతంగా పూర్తి చేశారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలుక కక్ష్య పెంపు విన్యాసం పూర్తి చేశారు. ఈ నెల 10వ తేదీన 2.30 గంటలకు మూడోసారి కక్ష్య పెంపును చేపట్టనున్నారు. ప్రస్తుతం 282x40,225 కిలోమీటర్ల కక్ష్యంలో ఆదిత్య ఎల్-1 పరిభ్రమిస్తుందని ఇస్రో ప్రకటించింది. బెంగళూరు, పోర్ట్ బ్లెయిర్‌ని గ్రౌండ్ స్టేషన్లు ఆదిత్య గమనాన్ని పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.
 
శనివారం శ్రీహరికోట నుంచి బయలుదేరిన ఆదిత్య ఎల్-1ను హాలో ఆర్బిట్ అయిన లాంగ్రాంజియన్ పాయింట్-1 (ఎల్-1) లో ప్రవేశపెడతారు. ఈ పాయింట్ భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రయోగంలో ఉపగ్రహం సూర్యుడికి సమీపంగా వెళ్లడం కానీ, సూర్యుడి మీద లాండింగ్ కానీ ఉండదని ఇస్రో స్పష్టం చేసింది. వచ్చే ఐదేళ్లపాటు ఈ ఉపగ్రహం ఆదిత్యుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పంపిస్తుంది. ఆ తర్వాత కూడా మరో 10-15 సంవత్సరాల వరకు అది పనిచేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.