మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (16:10 IST)

దినకరన్ వర్గానికి షాక్... ఎమ్మెల్యేపై ఇళ్ళపై ఐటీ దాడులు

అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన కీలక నేత, ఎమ్మెల్యే సెంధిల్ బాలాజీకి షాక్ తగిలింది. ఆయన ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన కీలక నేత, ఎమ్మెల్యే సెంధిల్ బాలాజీకి షాక్ తగిలింది. ఆయన ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చెన్నైతో పాటు జిల్లా కేంద్రమైన కరూర్‌లో ఉన్న ఆయన నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ అంశం ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.
 
మరోవైపు దినకరన్ వర్గ ఎమ్మెల్యేలపై స్పీకర్ ధనపాల్ వేటు వేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, తమ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు శాసనసభలో బలపరీక్ష నిర్వహించకూడదంటూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. 
 
మరోవైపు... అన్నాడీఎంకే అసమ్మతినేత టీటీవీ దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ అసెంబ్లీ స్పీకర్‌ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి మద్రాసు హైకోర్టు నిరాకరించింది. స్పీకర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 18 మంది శాసనసభ్యులు దాఖలు చేసిన పిటీషన్‌పై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు.. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, స్పీకర్‌ ధనపాల్‌, అసెంబ్లీ కార్యదర్శి భూపతి, ప్రభుత్వ విప్‌ రాజేంద్రన్‌లకు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.