మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (15:21 IST)

పన్నీర్ సెల్వంతో చేతులు కలిపేది లేదు: జయలలిత మేనకోడలు దీప

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప మాటమార్చింది. ఇటీవల జయ సమాధి వద్ద కూడా పన్నీర్ సెల్వంతో కలిసి నివాళులు అర్పించారు. పన్నీర్‌తో భవిష్యత్తులో కలిసి పనిచేందుకు విముఖత వ్యక్తం చేయలేదు. కానీ పన్నీర్

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప మాటమార్చింది. ఇటీవల జయ సమాధి వద్ద కూడా పన్నీర్ సెల్వంతో కలిసి నివాళులు అర్పించారు. పన్నీర్‌తో భవిష్యత్తులో కలిసి పనిచేందుకు విముఖత వ్యక్తం చేయలేదు. కానీ పన్నీర్ మెజార్టీ ఎమ్మెల్యేలను కూడగట్టలోకపోవడం, పళనిస్వామికి పోటీ ఇవ్వలేకపోవడంతో దీప మనసు మార్చుకుని ఉండొచ్చని సమాచారం. 
 
ఇంకా జయలలిత నివసించిన పోయెస్ గార్డెన్‌పై తనకు ఎలాంటి ఆసక్తి లేదని దీప వెల్లడించారు. జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్.కె.నగర్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానన్నారు. శుక్రవారంనాడు జయలలిత 69వ జయంతి సందర్భంగా కొత్త పార్టీని దీప ప్రకటిస్తారని వార్తలొచ్చాయి. కానీ అమ్మ ఫ్యాన్సును ఒకే వేదికపైకి తెచ్చేందుకు కలిసి పనిచేస్తామని భరోసా ఇచ్చారు. అయితే ప్రస్తుతం మాట మార్చారు. మరి దీప మనసులో ఏముందో తెలియాలంటే వేచి చూడాలి.