శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 5 మార్చి 2017 (16:46 IST)

నయీం కేసులో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ 'నేతి' మెడకు ఉచ్చు

రౌడీషీటర్ నయీం కేసులో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు చుట్టూత ఉచ్చు బిగుస్తోంది. నయీమ్‌తో సంబంధాలున్నట్లు గుర్తించిన సిట్ అధికారులు ఆదివారం విద్యాసాగర్ రావును విచారించారు. సి

రౌడీషీటర్ నయీం కేసులో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు చుట్టూత ఉచ్చు బిగుస్తోంది. నయీమ్‌తో సంబంధాలున్నట్లు గుర్తించిన సిట్ అధికారులు ఆదివారం విద్యాసాగర్ రావును విచారించారు. సిట్ అధికారులు ఇప్పటికే రెండుసార్లు ఆయనను విచారించారు. 
 
విచారణలో నయీమ్ భార్య ఫర్హానాతో కలిసి విద్యాసాగర్ రావు భార్య భూమి కొన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా తనకు నయీమ్‌తో సంబంధాలున్నట్లు విద్యాసాగర్ రావు అంగీకరించారు. మొత్తం రెండు గంటల పాటు సాగిన విచారణలో నేతి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. నాగేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో విద్యాసాగర్ రావును సిట్ ప్రశ్నించింది. 
 
నాగేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేతి విద్యాసాగర్‌పై కేసు నమోదు చేశారు. నయీమ్‌తో తనకు స్నేహం ఉండేదని ఈ విచారణలో విద్యాసాగర్ తెలిపారు. నయీంను తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెల్సిందే.