శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జనవరి 2024 (16:59 IST)

విమానం ఆకాశంలో ఉండగానే డోర్ ఊడిపోయింది..

Alaska Airlines plane
Alaska Airlines plane
విమానం గాలిలో ఉండగానే డోర్ ఊడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఫ్లైట్‌లో ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ సిటీ నుంచి ఏఎస్‌1282 విమానం టేకాఫ్ తీసుకుంది. 
 
టేకాఫ్ తీసుకుని కొంత దూరం ప్రయాణించిన త‌ర్వాత విమానం డోరు ఊడిపోయింది. దీంతో చాకచక్యంగా వ్యవహరించిన పైలెట్‌లు పోర్ట్‌ల్యాండ్ అంత‌ర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆ స‌మ‌యంలో విమానంలో 171 మంది ప్ర‌యాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. 
 
అనూహ్యంగా విమానం డోర్ ఊడిపోవడంతో విమానం ల్యాండ్ అయ్యేంత వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. గగనతలంలోనే డోర్ ఊడిపోవడంతో విపరీతమైన గాలి ధాటికి ప్రయాణికుల ఫోన్లు ఎగిరిపడ్డాయి.  
 
అయితే ఘటనపై అలస్కా ఎయిర్ లైన్స్ స్పందించింది. ఘటనకు సబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.