అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం సమావేశం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం సమావేశం జరుగబోతోంది. మణిపూర్‌లో మే 3 నుంచి వరుసగా హింసాత్మక ఘటనలు, కాల్పులు జరుగుతుండటంతో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌పై నిషేధాన్ని జూన్ 25 వరకు పొడిగించింది.
మే 3న మణిపూర్‌లో మెయిటీలను షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) జాబితాలో చేర్చాలనే డిమాండ్‌కు నిరసనగా ఆళ్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూనియన్ (ఏటీఎస్‌యూ) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చెలరేగడంతో హింస చెలరేగింది.
రాష్ట్రంలోని లోయ ప్రాంతంలో మైయిటీలు మెజారిటీ వుండగా.. కొండ ప్రాంతాల్లో కుకీలు మెజారిటీగా వున్నారు. ఈ రెండు వర్గాల మధ్య ప్రస్తుతం తీవ్ర ఆధిపత్య పోరు నెలకొంది.
ఇప్పటికే ఈ ఘర్షణలో 120 మందికిపైగా మరణించారు. 50 రోజులుగా మణిపూర్ మండుతున్నా.. ప్రధాన మంత్రి మోదీ మౌనంగా వున్నారని విమర్శలు వచ్చిన వేళ.. ప్రధాని దేశంలో లేని సమయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.