పట్టపగలు అందరూ చూస్తుండగానే ఎంఐఎం కౌన్సిలర్ హత్య
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఎంఐంఎం కౌన్సిలర్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. దుండగులు మోటారు వాహనంపై వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
నౌచండి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధబాయ్ నగర్‌లో నివాసం ఉండే 40 ఏళ్ల జుబైర్ ఉదయం తన ఇంటి వెలుపల కారులో కూర్చుని ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు పోలీసు సూపరింటెండెంట్ వినీత్ భట్నాగర్ తెలిపారు.
80వ వార్డు నుండి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు జుబైర్. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ హత్యకు ఆస్తి వివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.