శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (20:15 IST)

విలువైన అంశాల జాబితాలో బార్బర్‌కు అగ్రస్థానం : ఆనంద్ మహీంద్రా

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే దేశ పారిశ్రామికవేత్తల్లో మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒకరు. ఈయన దేశంలో ఎక్కడైనా హృదయాన్ని కలిగించే సంఘటన జరిగితే దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తుంటారు. అలాగే, ఆపదలో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు. ఇపుడు కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఫలితంగా అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 
 
ఈ సేవల్లో విలువైనవి ఏవి అనే అంశంపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. మనం సుఖంగా జీవించడానికి అవసరమైన నిత్యావసర అంశాలు చాలా తక్కువ అని ఈ లాక్‌డౌన్ మనకు తెలియజెప్పిందని పేర్కొన్నారు. "ఈ సందర్భంగా విలువైన అంశాల జాబితాలో నేను నా క్షురకుడికి తిరుగులేని అగ్రస్థానం ఇస్తాను. ఎందుకంటే, లాక్‌డౌన్ కారణంగా నా జుత్తును నేనే ఎలా కత్తిరించుకోవాలి అనే అంశం తప్పనిసరిగా నేర్చుకోవాల్సి వచ్చింది. చాలావరకు ఈ విద్యను నేర్చుకున్నాననే భావిస్తున్నాను" అని వెల్లడించారు.