అంజనా మిశ్రా కేసు.. 22 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయ, దిశ చట్టాలెన్ని వచ్చినా కామాంధుల తీరు మారట్లేదు. తాజా ఒడిశాలో సంచలనం సృష్టించిన అంజనా మిశ్రా సామూహిక లైంగికదాడి కేసులో ప్రధాన నిందితుడు బీబన్ బిశ్వాల్‌ని పోలీసులు అరెస్టు చేశారు. లైంగికదాడి ఘటన జరిగిన 22 ఏళ్ల తర్వాత అతన్ని పట్టుకున్నట్లు ట్విన్ సిటీ పోలీసు కమిషన్ సుధాన్షు సారంగి వెల్లడించారు.
1999లో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మాజీ భార్య అంజనా మిశ్రాను ఆ ఏడాది జనవరి 9వ తేదీన అంజనా మిశ్రా.. సామూహిక లైంగికదాడి గురైంది. తన ఫ్రెండ్‌తో కలిసి వాహనంలో వెళ్తున్న ఆమెపై భువనేశ్వర్ శివారు ప్రాంతమైన బారంగ్‌లో స్నేహితుడి ముందే ముగ్గురు ఈ దారుణానికి పాల్పడ్డారు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
ఈ కేసులో పదియా సాహూ, దీరేంద్ర మోహంతిలను ఆ ఏడాదే పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును సీబీఐ విచారించింది. 2002లో ఈ కేసును అంజనా గెలిచింది. నిందితులకు జీవితకాల శిక్షతో పాటు 5వేల జరిమానా విధించారు. ఆ నాటి నుంచి బీబన్ బిశ్వాల్ పరారీలో ఉన్నారు.
అతన్ని పట్టుకునేందుకు ఒడిశా పోలీసులు 'సైలెంట్ వైపర్' అన్న పేరుతో ఆపరేషన్ స్టార్ట్ చేశారు. పేరు మార్చుకున్న బీబన్.. మహారాష్ట్రలో ఓ ప్లంబర్‌గా పనిచేశాడు. ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అతన్ని నేడు అరెస్టు చేశారు.