మంగళవారం, 16 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (17:21 IST)

'అక్రమ సంబంధం నేరం కాదు' తీర్పులో సుప్రీంకోర్టు ట్విస్ట్

lovers
గతంలో అక్రమ సంబంధం నేరం కాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు ట్విస్ట్ ఇచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న సైనిక అధికారులపై సాయుధ దళాల చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని తేల్చి చెప్పింది. 
 
అక్రమ సంబంధం నేరం కాదంటూ గత 2018లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మంగళవారం స్పష్టత నిచ్చింది. ఐపీసీలోని సెక్షన్ 497ను కొట్టివేస్తూ 2018లో జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు సాయుధ దళాల చట్టంలోని నిబంధనలకు సంబంధం లేదని అందువల్ల వివాహేతర సంబంధం పెట్టుకున్న సైనిక అధికారులపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. 
 
వివాహేతర సంబంధం నేరం కాదన్న తీర్పుపై  రక్షణ శాఖ 2018 సెప్టెంబరు 27వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ తీర్పు నుంచి సాయుధ దళాలకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. దీనిపై వివిధ దఫాలుగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు కోర్టు ఈ తీర్పునకు సాయుధ దళాల చట్టానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.