శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 8 జనవరి 2019 (12:01 IST)

ఉసురు తీసుకుంటున్న భారత సైనికులు.. ఎందుకు?

దేశంలో భారత జవాన్ల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. గత యేడాది మాత్రమే ఏకంగా 80 మంది సైనికులు, 16 మంది ఎయిర్‌ఫోర్స్, 8 మంది నేవీ జవాన్లు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే వెల్లడించారు.
 
అలాగే, 2017లో ఆత్మహత్య చేసుకున్న సైనికుల సంఖ్య 75గా ఉండగా, 2016లో ఈ సంఖ్య 104గా ఉన్నది. ఎయిర్‌ఫోర్స్ విషయానికి వస్తే 2017లో 21 మంది, 2016లో19 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే, కోస్ట్‌గార్డ్ విషయానికి వస్తే 2017వో 5 మంది, 2016లో 6 మంది సూసైడ్ చేసుకున్నారు. 
 
అయితే, భారత ఆర్మీలో సైనికుల ఆత్మహత్యలను అడ్డుకునేందుకు రక్షణ శాఖ అనేక రకాలైన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా, సైనికులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. నివశించేందుకు బస సౌకర్యంతో పాటు.. రవాణా, పిల్లలకు విద్య, కుటుంబ సక్షేమ పథకాలు, యోగా తరగతులు, శారీరక వ్యాయామం, మానసిక కౌన్సెలింగ్ వంటివి సమకూర్చుతున్నట్టు మంత్రి వెల్లడించారు.