సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2019 (17:02 IST)

అమ్మకు నాన్నే నిప్పంటించాడు.. ఆర్మీ జవానుపై ఏడేళ్ల కుమార్తె కంప్లైంట్

పేరుకే ఆర్మీ జవాను. కానీ భార్యనే హత్య చేసాడు. ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ మేరకు కూతురిని హత్య చేసింది అల్లుడేనని.. మనవరాలి ద్వారా తెలియరావడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళితే.. తిరువణ్ణామలై, పోలూరు, కృష్ణపురం గ్రామానికి చెందిన నాగేంద్రన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. 
 
ఇతడి భార్య పేరు రేణుక. నాగేంద్రన్, రేణుక దంపతులకు యోగిశ్రీ (7), తన్యశ్రీ (1) అనే ఇద్దరు కుమార్తెలు వున్నారు. గుజరాత్‌లోని ఆర్మీ హౌసింగ్ సొసైటీలో వీరు నివాసమున్నారు. ఈ నేపథ్యంలో గత 27వ తేదీ రేణుకా తండ్రికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. సిలిండర్ పేలి రేణుకా మృతి చెందిందని తెలిసింది. దీంతో రేణుకా మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. 
 
కానీ రేణుక అంత్యక్రియలు జరుగుతుండగా, తన తల్లికి తండ్రే నిప్పంటించి చంపేశాడని రేణుక కుమార్తె యోగి శ్రీ చెప్పడంతో షాకైన రేణుక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జరిపిన విచారణలో నాగేంద్రన్‌కు వేరొక మహిళలో అక్రమసంబంధం వుండేదని.. దాన్ని వ్యతిరేకించిన రేణుకను హత్య చేసినట్లు సమాచారం.