సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (16:26 IST)

వ్యోమగామి దుస్తులతో.. గుంతల రోడ్డుపై.. అంతరిక్షంలో నడుస్తున్నట్లు.. వీడియో వైరల్

ఓ కళాకారుడు వినూత్న ప్రయత్నం చేశారు. గుంతల రోడ్లతో ప్రజలు పడుతున్న బాధలను వెలిగెత్తేందుకు ఓ కళాకారుడు వినూత్న ప్రయత్నం చేశారు. వ్యోమగామి దుస్తులతో గుంతల రోడ్డుపై నడుస్తూ వినూత్నమైన పద్ధతిలో తన నిరసనను తెలిపారు. బాదల్ నంజుందస్వామి అనే కళాకారుడికి ఈ ఆలోచన వచ్చింది. 
 
వ్యోమగామి దుస్తులు ధరించి అంతరిక్షంలో వేరే గ్రహంపై నడిచినట్లుగా నటిస్తూ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను రోడ్డుపై ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ అంతరిక్షంలోనే ఉన్నట్లు రూపొందించాడు. 
 
ఈ వీడియో చూస్తున్నంతసేపు అంతరిక్షంలోనే ఉన్నాడనే భావన కలుగక మానదు. బెంగళూరులోని రహదారుల అధ్వాన్నపరిస్థితి చాటిచెప్పే ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.