శుక్రవారం, 19 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (22:59 IST)

అరుణాచల్‌ ప్రదేశ్‌లో తొలి విమానాశ్రయం_ఆగస్టు 15 నుంచి ప్రారంభం

Arunachal Pradesh
Arunachal Pradesh
అరుణాచల్‌ ప్రదేశ్‌‌ వైపే ప్రస్తుతం ప్రజలు కన్నేసి వుంచారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్నా ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క విమానాశ్రయం కూడా లేకపోవటం పెద్ద లోటుగా అనిపించేది.
 
అయితే ఆ సుదీర్ఘ ఎదురుచూపులకు వచ్చే ఆగస్టు 15వ తేదీతో తెరపడబోతోంది. సొంత ఎయిర్‌పోర్ట్‌ కోసం ఆ రాష్ట్రం ఇన్నాళ్లూ కన్న కల నిజం కానుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో తొలి విమానాశ్రయం ప్రారంభం కానుంది. 
 
ఆ విమానాశ్రయం పేరు.. హోలోంగి ఎయిర్‌పోర్ట్‌. అక్కడి నుంచి ఆగస్టు 15న విమానాల రాకపోకలు ఆరంభం కానున్నాయి. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌.. రాష్ట్ర రాజధాని ఇటానగర్‌కి 15 కిలో మీటర్ల సమీపంలోనే ఉండటం విశేషం.
 
అరుణాచల్‌ ప్రదేశ్‌ భౌగోళికంగా, ప్రకృతిపరంగా అందమైన రాష్ట్రం. పూదోటల స్వర్గం. మంచుతో కూడిన పర్వతాలు, సహజ లోయలు, తళుక్కున మెరిసే ప్రవాహాలు, బౌద్ధ సన్యాసులు పఠించే శ్లోకాలు, వైవిధ్య వృక్ష, జంతుజాలాలతో పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించే ప్రాంతం. 
 
ఇన్నాళ్లూ ఈ రాష్ట్రానికి టూరిస్టులు వెళ్లాలంటే రకరకాల మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం విమానాశ్రయం ఈ ప్రాంతానికి రావడంతో.. పర్యాటకులు పండగ చేసుకుంటారనే చెప్పాలి. ఇంకా పర్యాటకుల తాకిడి పెరగక తప్పదని టాక్.