బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 జులై 2022 (21:56 IST)

తెలంగాణలో భారీ వర్షాలు.. హెలికాఫ్టర్ ఆ ఇద్దరినీ అలా కాపాడింది.. ఫోటోలు

Rescue opertion
Rescue opertion
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో భారీ వరదల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 
 
ఈ నేపథ్యంలో 2022 జూలై 14న ఉదయం 10.30 గంటలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి హకీంపేట్, సికింద్రాబాద్ ఐఏఎఫ్ స్టేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం నుంచి అభ్యర్థన అందింది. గంటలోపు చేతక్ హెలికాప్టర్ మంచిర్యాల సమీపంలోని ప్రభావిత ప్రాంతం వైపు దూసుకెళ్లింది. 

Rescue opertion
Rescue opertion
 
అక్కడికి చేరుకున్న తరువాత, పైలట్లు పరిస్థితిని అంచనా వేసి, ఇద్దరు వ్యక్తులను రక్షించడానికి సహాయక ఆపరేషన్లు నిర్వహించారు. తర్వాత వారిని సమీపంలోని హెలిప్యాడ్‌కు తరలించారు. పైలట్లు ధీటుగా ఈ ఆపరేషన్‌ను సక్సెస్‌ చేశారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.