శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (08:17 IST)

ఈ ఏడాది జనగణన లేనట్లే!

జనభా లెక్కల సేకరణ (సెన్సెస్‌), జాతీయ జనాభా రిజస్టరు (ఎన్‌పిఆర్‌) నమోదు ఈ ఏడాది లేనట్లుగా తెలుస్తోంది. మహమ్మారి నియంత్రణ ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు లేకపోవడంతో ఈ ఏడాదిలో జన గణన ఉండకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

షెడ్యూల్‌ ప్రకారం సెన్సెన్‌ తొలిదశ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా వాయిదా వేశారు.  'ప్రస్తుతానికి సెన్సెస్‌ అత్యవసరమైన కార్యక్రమం కాదు. ఇది ఒక ఏడాది వాయిదా కూడా పడచ్చు. ఇది ఏమీ నష్టం కాదు' అని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు.

'ఇప్పటికీ కోవిడ్‌-19 ముప్పు ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ప్రస్తుతానికి సెన్సెస్‌, ఎన్‌పిఆర్‌ లేదు'  ఆ అధికారి వ్యాఖ్యానించారు.