శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:22 IST)

నటి జెనీలియాకి కరోనా

నటి జెనీలియా డిసౌజా కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ప్రకటించారు. 
మూడు వారాల క్రితం కరోనా పాజిటివ్‌ నిర్థారణైందని, అయితే ఎటువంటి లక్షణాలు లేవని జెనీలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.

21 రోజుల ఐసోలేషన్‌లో ఉన్న అనంతరం శనివారం తిరిగి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా రిపోర్టు వచ్చిందని అన్నారు. ఒంటరిగా ఈ వైరస్‌ను ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నదని అన్నారు.

'ఇప్పుడు నా కుటుంబసభ్యులను కలుసుకున్నాను. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. సమస్య ఉన్నట్లు గుర్తించిన వెంటనే పరీక్షలు చేయించుకోండి. ఈ మాన్‌స్టర్‌తో పోరాడటానికి ఏకైక మార్గం ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం, ధృడంగా ఉండడమే' అని చెప్పారు.