శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (07:10 IST)

అసదుద్దీన్ బీజేపీకి రహస్య మద్దతుదారు: శివసేన

అసదుద్దీన్ ఓవైసీ బీజేపీకి రహస్య మద్దతుదారు అని శివసేన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీకి అనుకూలంగా ఓవైసీ వ్యవహరిస్తారని, ఆయన మద్దతుదారులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని వ్యాఖ్యానించినా ఆశ్చర్యపోనక్కర్లేదని శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో సోమవారం రాసుకొచ్చారు.

ఓవైసీ బీజేపీ బీ టీం అంటూ అనేక విమర్శలు వస్తూనే ఉంటాయి. తాజాగా శివసేన కూడా ఇదే విధమైన విమర్శలు చేయడం గమనార్హం.

సోమవారం రాసుకొచ్చిన సంపాదకీయంలో ‘‘ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. చాలా కాలంగా బీజేపీకి తెరచాటుగా సహకారం అందిస్తున్న ఓవైసీ.. మతపరమైన, జాతి పరమైన అంశాలను తెరపైకి ఎత్తేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

పాకిస్తాన్ పేరు ఇందులో ప్రధానంగా వినిపించనుంది. ఓవైసీ మద్దతుదారులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే ఒక్క నినాదం చేశారంటూ అది బీజేపీకి ఎంతగానో ఉపయోగపడుతుంది’’ అని రాసుకొచ్చారు.