డిమాండ్ లేక ఆటోపరిశ్రమ విలవిల!

auto industry
ఎం| Last Updated: శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (07:56 IST)
దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనంతో వాహనాల అమ్మకాలు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. వాహనాల కొనుగోలు వ్యయం పెరుగుదల, బీమా వ్యయం పెరగడం, అధిక వడ్డీ రేట్లు, లిక్విడిటీ సమస్య, ధరల పెంపు వంటి అంశాల కారణంగా అమ్మకాలు తగ్గాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

ఆర్థిక మందగమనం ప్రభావంతో ఆటోమొబైల్ రంగం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కుంటోంది. అదే తోవలో విడిభాగాల అమ్మకాలు కూడా పడిపోయాయి. ఇటీవల కాలంలో డిమాండ్ తగ్గిపోవటం వల్ల సాధారణం కంటే 25 నుంచి 30 శాతం తక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయని విక్రయదారులు వెల్లడించారు.

సాంకేతికత పెరగటం కూడా కారణం విక్రయాలు తగ్గిపోవటానికి కారణం కేవలం ఆర్థిక మందగమనమే కారణం కాదని ఈ రంగంలోని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో పెరిగిన సాంకేతికతతో ఎక్కువ కాలం మన్నిక గలిగిన వాహనాలు వస్తున్నాయి.

కంపెనీలు కూడా ఎక్కువ వారంటీని వినియోగదారులకు ఇస్తున్నాయి. మొత్తంగా వినియోగదారులకు ఎలాంటి సమస్య తలెత్తినా ఉత్పత్తి చేసిన కంపెనీనే దాని ఖర్చును భరిస్తోంది. ఈ కారణంతో కూడా విడిభాగాల విక్రయాలు పడిపోతున్నాయి.

జీఎస్టీని తగ్గించాలి ఎక్కువ శాతం విడిభాగాలు 28 శాతం జీఎస్టీ శ్లాబులో ఉన్నాయి. కొన్ని 18 శాతం శ్లాబులో ఉన్నాయి. జీఎస్టీ తగ్గించాలని ప్రభుత్వాన్ని విన్నవించామని ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ తెలిపింది.
దీనిపై మరింత చదవండి :