Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ భవనంలో కుప్పకూలిన మెట్లు (వీడియో)

Written By ఠాగూర్
Updated: సోమవారం, 6 జులై 2026 (19:59 IST)
అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ భవనంలో నాసికరకం ఇంజనీరింగ్ పనులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ భవనంలో నిర్మించిన మెట్లు నాసికరకం పనుల కారణంగా కూలిపోయాయి. ఈ ఘటన జరిగినపుడు ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా, మేయర్ మహంత్ గిరీష్ త్రిపాఠి అక్కడే ఉన్నట్టు సమాచారం. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ భవనంలో నిర్వహించిన ఓ మీటింగ్‌లో పాల్గొనేందుకు కోచింగ్, లైబ్రరీ ఆపరేటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే మెట్లు కుప్పుకూలిపోయాయి. దీంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీనిపై విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ చెప్పిన వికాస్ ఇదేనా అంటూ జనం మండిపడుతున్నారు. అయోధ్య నిర్మాణ పనుల్లో నాసికరకం పనులు చోటు చేసుకున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇపుడు ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది.

 
About Author
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

హీరో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... కిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాట్లు...

NTR Surgery: ఎన్టీఆర్ భుజానికి రేపు హైదరాబాద్‌లో శస్త్రచికిత్స !

మిస్సింగ్ మేఘన లో పిల్ల పిల్ల పిల్ల సాంగ్ చాలా బాగుంది : సురేష్ బాబు

Naresh: పదేళ్లుగా మిస్ అయిన నరేష్‌ను రంభ ఊర్వశి మేనక లో చూస్తారు : అల్లరి నరేష్

Maheshbabu: రాముడిగా మహేష్ బాబు ఫ్యాన్ ఎడిట్ వారణాసి ఉత్సాహపరుస్తోంది

తర్వాతి కథనం
Show comments