మనిషి రక్తం మరిగిన పెద్దపులి.. కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు

tiger
ఠాగూర్| Last Updated: గురువారం, 10 అక్టోబరు 2019 (11:31 IST)
రాష్ట్రంలోని బండీపుర అడవుల్లో ఓ పెద్దపులి మనిషి రక్తాన్ని మరిగింది. బండీపుర అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఈ పెద్దపులి దెబ్బకు ఆ ప్రాంత వాసులంతా ప్రాణభయంతో వణికిపోతున్నారు. దీంతో ఈ పెద్దపులిని కనిపిస్తే కాల్చివేయాల్సిందిగా అటవీ శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు.

బండీపుర అభయారణ్యం పరిసరాల్లో ఓ పులి సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తుచేశారు. ఈ పులి కంటపడిన వారిలో ఏ ఒక్కరూ తిరిగి ప్రాణాలతో ఉండటం లేదు. దీంతో గ్రామస్థులకు కునుకులేకుండా పోయింది.

తాజాగా మంగళవారం చామరాజనగర్ పరిధిలోని గుండ్లుపేట సమీపంలో ఉన్న చౌడహళ్లి వద్ద పశువులను మేపేందుకు వెళ్లిన రైతుపై దాడి చేసిన పులి, అతన్ని హతమార్చింది. ఆపై బుధవారం నాడు ఓ ఆవును చంపి తినేసింది. ఈ పులిని తక్షణం హతమార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కర్ణాటక అటవీ శాఖ అధికారులు, ఈ పులి కనిపిస్తే కాల్చి వేయాలన్న ఆదేశాలను జారీ చేశారు.దీనిపై మరింత చదవండి :