ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 మే 2021 (08:30 IST)

బెంగుళూరు గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్ - కేరళలో యువతి

దేశ ఐటీ హబ్ బెంగళూరులోని రామమూర్తి నగర సమీపంలో బంగ్లాదేశ్ కు చెందిన 22 ఏళ్ల యువతి మీద గ్యాంగ్ రేప్ జరిగిన విషయం వెలుగు చూడటంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఢిల్లీలో నిర్భయ తరహా సంఘటనలాగా బెంగళూరులో బాంగ్లాదేశ్ యువతి మీద అత్యాచారం చేసిన నిందితులు ఆమె మర్మాంగంలో బీర్ బాటిల్ చెక్కేయడం, ఆమెను చిత్రహింసలకు గురి చెయ్యడం కలకలం రేపింది.
 
ఆ పోలీసుల అనుమానంతో క్లియర్ 
బాంగ్లాదేశ్ మీద గ్యాంగ్ రేప్ చేసి ఆమెను చిత్రహింసలు పెడుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. బెంగళూరులో ఈ దారుణం జరిగిందని వెలుగు చూడటంతో ఐటీ హబ్ ఉలిక్కిపడింది. గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు కామాంధుల పక్కనే మరో ఇద్దరు మహిళలు ఉన్న విషయం వీడియోలో కనపడింది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతి మీద అత్యాచారం జరిగిందనే అనుమానంతో అసోం పోలీసులు మొదట బెంగళూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
బాంగ్లాదేశ్ యువతి 
పోలీసుల విచారణలో బంగ్లాదేశ్ యువతి మీద అత్యాచారం జరిగిందని వెలుగు చూసింది. బెంగళూరు గ్యాంగ్ రేప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామమూర్తి నగర పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా బాంగ్లాదేశ్ కు చెందిన సాగర్, మోహమ్మద్ బాబా షేక్, రిదాయ్ బాబు, హైదరాబాద్‌కు చెందిన హకీల్ అనే కామంధులను అరెస్టు చేశారు. ఇదే కేసులో బాంగ్లాదేశ్‌కు చెందిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో బాంగ్లాదేశ్ మహిళ కోసం పోలీసులు గాలించి చివరికి ఆమెను అరెస్టు చేశారు.
 
హడలిపోయిన బెంగళూరు 
బాంగ్లాదేశ్ మీద గ్యాంగ్ రేప్ చేసి ఆమెను చిత్రహింసలు పెడుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. బెంగళూరులో ఈ దారుణం జరిగిందని వెలుగు చూడటంతో ఐటీ హబ్ ఉలిక్కిపడింది. గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు కామాంధుల పక్కనే మరో ఇద్దరు మహిళలు ఉన్న విషయం వీడియోలో కనపడటం కలకలం రేపింది. కర్ణాటక ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
 
అరెస్టు చేసిన నిందితులను స్పాట్‌లో విచారణ చెయ్యడానికి సాగర్, మోహమ్మద్ బాబా షేక్, రిదాయ్ బాబు, హైదరాబాద్‌కు చెందిన హకీల్ రామమూర్తి నగరలోని ఇంటి దగ్గరకు పిలుచుకుని వెళ్లారు. ఆ సమయంలో కామంధులను సాగర్, రిదాయ్ బాబు పోలీసుల మీద దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో సాగర్, రిదాయ్ కాళ్ల మీద కాల్పులు జరిపారు. 
 
బెంగళూరులోని రామమూర్తి నగరలో బాంగ్లాదేశ్ యువతి మీద గ్యాంగ్ రేప్ జరిగిన ఇంటిలో పోలీసులు సోదాలు చేశారు. బాంగ్లాదేశ్‌కు చెందిన యువతి మీద గ్యాంగ్ రేప్ చేసిన నిందితుల దగ్గర ఆధార్ కార్డులు, ఓటరు ఐడీ కార్డులు ఉండటం కలకలం రేపింది. బాంగ్లాదేశ్ జాతీయులకు ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డులు ఎవరు ఇచ్చారు? వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
కేరళలో బాధితురాలు 
గ్యాంగ్ రేప్‌కు గురైన యువతి కేరళలోని క్యాలికట్‌లో ఉన్న విషయం తెలుసుకున్న బెంగళూరు పోలీసులు అక్కడికి వెళ్లారు. కేసు విచారణ చేస్తున్న మహిళా పోలీసు ఇన్‌స్పెక్టరుతో పాటు ప్రత్యేక టీమ్ కేరళ చేరుకుని క్యాలికట్‌లో బాధితురాలికి వైద్యపరీక్షలు చేయిస్తున్నారని ఓ పోలీసు అధికారి అన్నారు. 
 
బాధితురాలు కేరళలోని ఓ ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకునిందని, ఆమెకు వైద్యపరీక్షలు చేయించి బెంగళూరు పిలుచుకుని వచ్చిన తర్వాత ఆమె నుంచి పూర్తి సమాచారం సేకరిస్తామని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు. బాధితురాలిని కోర్టు ముందు హాజరుపరిచి మరింత సమాచారం సేకరించడానికి బెంగళూరు పోలీసులు సిద్దం అయ్యారు.