బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 మే 2021 (21:18 IST)

రైతులకు శుభవార్త.. జూన్ 15 నుంచి రైతుబంధు

రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. జూన్‌ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమను పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. పార్ట్‌-బీ నుంచి పార్టీ-ఏ జాబితాలో చేర్చిన భూములకు సైతం ఈసారి రైతుబంధు సాయం వర్తింపజేయనున్నట్లు తెలిపింది. 
 
జూన్‌ 10ని కట్టాఫ్‌ తేదీగా నిర్ణయించి రైతుబంధు వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది. వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
 
ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ఆర్థికసాయం రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని సీఎం అన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ అవుతుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పంటసాయం వల్ల రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు అప్పులకు వెళ్లడం లేదు. సకాలంలో ఎరువులు, విత్తనాలు కొని అధిక దిగుబడులు సాధిస్తున్నారని సీఎం పేర్కొన్నారు.