గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (11:14 IST)

బైకు నడుపుతూ.. ఫేస్‌బుక్ లైవ్.. స్కిడ్ అయి కిందపడ్డాడు.. అంతే చనిపోయాడు..

స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. ఈ ఫోన్ల పుణ్యంతో సెల్ఫీల పిచ్చి ముదిరిపోతోంది. ఇంకా లైవ్ వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం ఫ్యాషనైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా బైక్‌పై వెళ్తూ వెళ్తూ ఫేస్‌బుక్ లైవ్ పెట్టాడు. 
 
అంతే బైక్ స్కిడ్ అయి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే., పశ్చిమబెంగాల్‌లోని అందాల్ పట్టణానికి చెందిన చంచల్ ధిబోర్ అనే 24 ఏళ్ల యువకుడు శనివారం సాయంత్రం సమీపంలోని కాళీ మాత గుడికి వెళ్లాడు. గుడి నుంచి తిరిగి వస్తుండగా.. బైక్ నడుపుతూనే ఫోన్ తీసి, ఫేస్ బుక్ లైవ్ ఆన్ చేశాడు. 
 
కానీ బండి కంట్రోల్ తప్పి కింద పడ్డాడు. దాంతో తలకు గట్టిగా దెబ్బ తగిలింది. చుట్టుపక్కల ఉన్న వాళ్లు అతడిని వెంటనే ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. 
 
చంచల్ బండి నడపడం, కింద పడిపోవడం, అది చూసినవారు వచ్చి హెల్ప్ చేయడం అంతా ఫేస్ బుక్ లైవ్‌లో కనిపించిందని చంచల్ స్నేహితులు వాపోతున్నారు. తమ మధ్య తిరుగుతూ వుండిన వ్యక్తి లేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని స్నేహితులు వాపోతున్నారు.