శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (08:36 IST)

అమ్మను కొడుతున్నాడనీ నాన్నను చంపేసిన కుమార్తె.. ఎక్కడ?

నిత్యం మద్యంసేవించి వచ్చి తమను చిత్ర హింసలు పెట్టడమేకాకుండా, అమ్మను కొడుతున్నాడనీ ఓ కుమార్తె కన్నతండ్రిని చంపేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగింది. అమ్మను నాన్న కొట్టడం చూసి భరించలేక ఆ బిడ్డ ఈ దారుణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి నిత్యం తాగి రావడమే కాకుండా, మిగిలిన కుటుంబ సభ్యులను కూడా వేధించసాగాడు. ఈయన కొడుకు మేస్త్రీ పని ద్వారా సంపాదిస్తుంటే 45 ఏళ్ల ఈ వ్యక్తి పనీపాటా లేకుండా తిరుగుతూ కుటుంబ సభ్యులు చిత్ర హింసలు పెట్టసాగాడు. 
 
అంతేకాకుండా, పెళ్లీడుకొచ్చిన కొడుకుకు పెళ్లి చేయాలని ఇంటి సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకుంటుండగా, మరోసారి తాగొచ్చి గొడవకు దిగిడమే కాకుండా భార్యను దారుణంగా కొట్టసాగాడు. దాంతో 16 ఏళ్ల అతని కుమార్తె వెంటనే పక్కనే ఉన్న కర్ర తీసుకుని బలంగా కొట్టింది. 
 
తలపై బలమైన దెబ్బలు తగలడంతో అతను కుప్పకూలిపోయాడు. ఆపై ఆ అమ్మాయి 100 నెంబరుకు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ బాలికను బాలనేరస్తుల సదనానికి తరలించారు.