1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: బుధవారం, 15 మార్చి 2023 (15:17 IST)

బీహార్‌లో సీరియల్ కిస్సర్ కలకలం: వస్తాడు.. ముద్దు పెడతాడు.. జంప్ అవుతాడు

బీహార్‌లో సీరియల్ కిస్సర్ కలకలం రేపుతున్నాడు. అమ్మాయిలే వాడి టార్గెట్. ఒంటరిగా దొరికితే చాలు పండుగ చేసుకుంటున్నాడు. వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు. తిరిగి చూసేలోపే పారిపోతాడు. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‏లోని జమై సదర్ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ మహిళ మధ్యాహ్నం సమయంలో ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీదకు వచ్చింది. ఇంతలో ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె ముందుకు వెళ్లి గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. 
 
తనకు జరిగిన అకృత్యాన్ని తలచి తేరుకునే లోపే.. ఆ కుర్రాడు జంప్ అయ్యాడు. దీంతో మహిళలు ఒంటరిగా బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.