1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 మే 2021 (21:09 IST)

ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కలవరం.. 40మందికి ఆస్పత్రిలో చికిత్స

Black fungus
దేశ రాజధానిలో తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూడటం కలవరం కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కొద్దిగా తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకున్న ఢిల్లీలో 50 మందికి బ్లాక్ ఫంగస్ సోకగా వీరిలో 40 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొవిడ్-19 రోగుల్లో విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వాడటంతోనే బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
కోవిడ్ -19 నుంచి కోలుకున్న మధుమేహుల్లోనూ ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులను నిరోధించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీతో పాటు కర్నాటక, ఉత్తరాఖండ్, ఏపీ, హర్యానా, మధ్యప్రదేశ్‌, బీహార్ రాష్ట్రాల్లోనూ బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్నాయి.