శనివారం, 14 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (21:53 IST)

నమాయి వెళుతున్న బస్సులో మంటలు - నలుగురు మృతి

bus catch fire
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో బస్సు ప్రమాదం ఒకటి జరిగింది. కత్రా నుంచి జమ్ము వెళుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జమ్మూలోని నమాయి వద్ద జరిగింది. 
 
కత్రా నుంచి జమ్మూకి వెళుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు యాత్రికుల కోసం కత్రా బేస్ క్యాంప్ ఉన్న విషయం తెల్సిందే. 
 
ఈ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.