స్వలింగుల వివాహాన్ని సమాజం అంగీకరించదు : కేంద్రం
భారత్‌లో వివాహానికి ఎంతో విలువ ఉందన్నారు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తులను కలిపేది కాదని, స్త్రీ, పురుషుల మధ్య ఓ బంధమని కేంద్రం పేర్కొంది. ఢిల్లీ హైకోర్టులో వచ్చిన ఓ కేసు విచారణ సందర్భంగా భారత్‌లో స్వలింగుల మధ్య వివాహం ప్రజలకున్న హక్కేమీ కాదన్నారు.
ఇటువంటి కేసుల్లో న్యాయస్థానాలు కల్పించుకోవడం వల్ల చట్టాల సున్నితమైన సమతుల్యత దెబ్బతింటోందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ మేరకు ఓ అఫిడవిట్‌ను సమర్పించిన కేంద్రం, స్వలింగుల మధ్య వివాహాన్ని సమాజం అంగీకరించదని, చట్టపరంగానూ గుర్తించలేమన్నారు.
హిందూ వివాహం చట్టం, ప్రత్యేక వివాహ చట్టాల కింద సేమ్ సెక్స్ మ్యారేజ్‌లను రిజిస్టర్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను మిత్రా, మరో ముగ్గురు హక్కుల కార్యకర్తలు గోపీ శంకర్, గీతీ తడానీ, ఊర్వశిలు దాఖలు చేశారు.