సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (22:28 IST)

థర్డ్ వేవ్ హెచ్చరికలు ఓవైపు... జికా వైరస్ మరోవైపు.. మహారాష్ట్రలో..?

ఒకవైపు కరోనా మహమ్మారి రూపాంతరాలు చెందుతూ ప్రజలను ఇంకా భయపెడుతూనే ఉంది. మన దేశంలో ఇంకా సెకండ్ వేవ్ ముగియక ముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇది చాలదని జికా వైరస్ కూడా ప్రబలుతోంది. ఇప్పటికే కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో వెలుగుచూసిన జికా వైరస్ తాజాగా మహారాష్ట్రలో కూడా వెలుగు చూసింది.
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలో పూణె జిల్లాలోని పురందర్ తహసీల్ పరిధిలో 50ఏళ్ల మహిళకు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)జులై 30న ఆమెకు పరీక్షలు జరిపి జికా వైరస్‌గా ఖరారు చేశారు. దీనిపై ఇప్పుడు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా కొంత మంది వైద్య నిపుణుల బృందాన్ని మహారాష్ట్రకు పంపించింది.
 
ఈ బృందంలో హార్డింగ్ మెడికల్ కాలేజీ గైనకాలజిస్ట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ నుంచి ఓ ఎంటమాలిజిస్ట్ సభ్యులుగా ఉండగా మొత్తం ముగ్గురు ఈ బృందంలో ఉన్నారు. మహారాష్ట్రలో ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేసి ఈ బృందం కేంద్ర ఆరోగ్య శాఖకు సిఫార్సు చేయనుంది.