శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జూన్ 2024 (19:05 IST)

ట్రెండింగ్‌లో మోదీపై బాబు విమర్శలు.. స్టాక్ మార్కెట్‌లో జోష్ ఎలా?

pawan kalyan-Modi-Babu
గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన పాత వీడియోలు, ట్వీట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి. ఆన్‌లైన్ చర్చలకు ఇవి దారితీస్తున్నాయి. 
 
భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థలను మోదీ క్రమపద్ధీకరించడంలో విఫలమయ్యారని.. బీజేపీ ప్రభుత్వ పాలనలో సంస్థాగత స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని విమర్శించారు. సిబిఐ నుండి ఆర్‌బిఐ వరకు, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ అధికారాన్ని కూడా విడిచిపెట్టలేదని నాయుడు గతంలో చేసిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  
 
మరోవైపు ఏన్డీఏ కూటమికి 300 సీట్ల కంటే తక్కువ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనడంతో ఎన్డీఏ మిత్రపక్షమైన తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాము కూటమితోనే ఉంటున్నట్లు స్పష్టం చేశారు. ఎన్డీఏలోనే కొనసాగుతమని తెలిపారు. దీంతో స్టాక్ మార్కెట్లు లాభాలను చూరగొన్నాయి. చంద్రబాబు ప్రకటన ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు ఢాకా లేదని అంచనాకు రావడంతో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఫలితంగా సూచీలు పెపైకి దూసుకెళ్తున్నాయి.