సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జులై 2020 (11:22 IST)

కూలీల కొరత.. వరి నాట్లు వేసిన ఛత్తీస్ గఢ్ మహిళా ఎంపీ

కొందరు రాజకీయ నాయకులు సామాజిక సేవలు చేస్తూ ఫోటోలకు ఫోజిస్తారు. కానీ ఓ మహిళా ఎంపీ నిజమైన నాయకురాలు అనిపించుకుంది. కూలీల కొరత ఉండటంతోనే స్వయంగా పొలానికి వెళ్లి వరి నాటేశారు. 
 
ఛత్తీస్ గఢ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫూలో దేవీ నీతమ్.. వరి నాటేసి అందరి దృష్టిని ఆకర్షించారు. తన సొంత గ్రామమైన కొండగావ్‌లో వరినాట్లు వేసేందుకు కూలీల కొరత ఉందని ఎంపీకి తెలిసింది. దీంతో ఆమెనే నేరుగా పంట పొలానికి వెళ్లి వరి నాటేశారు.
 
ఈ సందర్భంగా ఎంపీ నీతమ్ మాట్లాడుతూ.. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని వెల్లడించారు. కోవిడ్ కారణంగా కూలీల కొరత ఉందని తెలిసింది. సొంతంగా పంట వేసుకోవడం మంచిదే కదా అని.. తానే నాటేసేందుకు వచ్చానని చెప్పారు. తనకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. ఇక్కడికి రెండు, మూడు సార్లు వచ్చాను. పంట పొలానికి రావడంతో ఎంతో హాయిగా ఉంటుందని ఎంపీ పేర్కొన్నారు.