శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (19:16 IST)

మైనర్ బాలికను గర్భవతిని చేశాడు.. ఐనా ఆ తల్లి పట్టించుకోలేదు.. చివరికి?

అమ్మతనానికి మచ్చ తెచ్చేలా ఆ తల్లి ప్రవర్తించింది. తనను ఒక దుర్మార్గుడు లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పినా పట్టించుకోలేదు. చివరికి ఆమెను లొంగదీసుకున్నా.. చూసీ చూడనట్టు ఉండాలని.. ఇవన్నీ పట్టించుకోవద్దని.. సర్దుకుపోవాలని చెప్పింది. ఈ ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే.. తనతో వివాహేతర సంబంధం కలిగివున్న వ్యక్తి కారణంగానే తన కూతురును లైంగికంగా వేధింపులకు గురిచేసి..  గర్భం వచ్చేలా చేసింది.
 
వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని షోలింగనల్లూరుకు చెందిన ఓ మహిళ భర్తను వదిలిపెట్టి 15 ఏళ్ల కూతురుతో కలిసి నివసిస్తోంది. అంతేగాకుండా అత్యంత హేయంగా ప్రవర్తించింది. కొద్దికాలంగా ఆమె.. తన ఇంటి పక్కనే ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతుంది. ఇదే క్రమంలో తరుచూ ఇంటికొచ్చే ఆ దుండగుడి కన్ను.. ఆ మహిళ కూతురు మీద పడింది. దీంతో అతడు.. ఆ బాలికను కూడా లైంగికంగా వేధించాడు. 
 
సదరు నిందితుడు తనను లైంగికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న దాని గురించి ఆ కూతురు తల్లికి చెప్పింది. కానీ ఆ తల్లి మాత్రం దీనిని చూసీ చూడనట్టు వదిలేయాలని ఆమెకు చెప్పింది. ఆ నీచుడికి సహకరించాలని సూచించింది. ఇదే అదునుగా తీసుకున్న ఆ నిందితుడు ఆ మైనర్ ను పూర్తిగా తన మాయ మాటలతో లైంగికంగా లొంగదీసుకున్నాడు. ఇదే క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆ బాలిక గర్భవతి అని తేలింది. 
 
ఈ విషయాన్ని దాచేందుకు ప్రయత్నించిన తల్లి నుంచి తప్పించుకున్న మైనర్ బాలిక మేనమామలతో ఈ విషయం వెల్లడించింది. మేనమామల సాయంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆమెను బాలల సంరక్షణ గృహానికి పంపారు. ఆ మైనర్ బాలిక అక్టోబరులో ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఆమె తల్లి, బాలికను గర్భవతిని చేసిన ఆ దుండగుడిని పట్టుకున్న పోలీసులు.. వారిని కటకటాల వెనక్కి పంపారు.