శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 జనవరి 2024 (22:43 IST)

ఛత్తీస్‌గఢ్ ప్రజలు అయోధ్యకు రైలులో ఉచితం జర్నీ చేయొచ్చు..

ayodhya temple
ఛత్తీస్‌గఢ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 22న అయోధ్యలోని రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా సెలవు ఉంటుందని రాష్ట్ర మంత్రి బ్రిజ్‌మోహన్ అగర్వాల్ గురువారం తెలిపారు. విష్ణు దేవ్ సాయి ప్రభుత్వంలో మతపరమైన ట్రస్ట్-ఎండోమెంట్, పాఠశాల-ఉన్నత విద్యతో పాటు సంస్కృతి, పర్యాటక శాఖలను నిర్వహిస్తున్న అగర్వాల్ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, అయోధ్యకు వారానికోసారి ఉచిత రైలు ప్రయాణ పథకాన్ని కూడా ప్లాన్ చేసినట్లు చెప్పారు. 
 
"ప్రధాని నరేంద్ర మోదీ హామీ ప్రకారం, రామ్ లల్లా దర్శనం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రజలు అయోధ్యకు రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుంది. 
 
ఈ పథకంలో భాగంగా వారానికో రైలులో 850 నుంచి 1000 మంది భక్తులు అయోధ్య వరకు ప్రయాణించవచ్చు. రైలులో వృద్ధులు, వికలాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారు సహాయకులతో ప్రయాణించవచ్చు" అని అగర్వాల్ తెలిపారు.