''మేక్ ఎ విష్'' బెంగళూరు పోలీసులు ఆ ఐదుగురిని ఏం చేశారంటే?

Last Updated: మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (17:06 IST)
''మేక్ ఎ విష్''లో భాగంగా ఐదుగురు చిన్నారులను బెంగళూరు పోలీసులు కమిషనర్ ఆఫ్ పోలీసులుగా నియమించారు. ప్రాణాంతకవ్యాధితో బాధపడుతున్న ఐదుగురిని బెంగళూరు సిటీ పోలీసులు.. మేక్ ఏ విష్ ఫౌండేషన్ వారి కోరిక మేరకు ఐదుగురు చిన్నారులను ఒక రోజు పోలీస్ అధికారులుగా నియమించి వారి కోరికను తీర్చారు.

వారి వయస్సు ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య వుంటుంది. అలా పోలీసులుగా నియామకం అయిన చిన్నారుల ముఖం ఆ సమయంలో సంతోషంతో నిండిపోయింది. చిన్నారులకు ఈ అరుదైన అవకాశమిచ్చిన పోలీసు శాఖ వారికి ఈ సందర్భంగా ఫౌండేషన్ వారు ధన్యవాదాలు తెలియజేశారు.దీనిపై మరింత చదవండి :