మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 20 జనవరి 2018 (18:00 IST)

విద్యార్థిని మందలించింది.. తుపాకీతో ప్రిన్సిపాల్‌ను కాల్చేశాడు..

విద్యార్థిని మందలించిన పాపానికి ఆ ప్రిన్సిపాల్ హత్యకు గురైంది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హర్యానా యమునా నగర్, తాపేర్ కాలనీలోని స్వామి వివేకానంద కాలేజీలో 12వ తరగతి విద్యార్థి త

విద్యార్థిని మందలించిన పాపానికి ఆ ప్రిన్సిపాల్ హత్యకు గురైంది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హర్యానా యమునా నగర్, తాపేర్ కాలనీలోని స్వామి వివేకానంద కాలేజీలో 12వ తరగతి విద్యార్థి తమ మహిళా ప్రిన్సిపాల్‌ రితా చబ్రాను తుపాకీతో కాల్చి చంపేశాడు. ప్రిన్సిపాల్ ఆఫీసులో వుండగా.. అక్కడికెళ్లిన విద్యార్థి ఆమెపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. 
 
కాలేజీకి వచ్చేటప్పుడే విద్యార్థి వెంట తుపాకీ తెచ్చుకున్నాడు. ప్రిన్సిపాల్‌ను హతమార్చిన విద్యార్థి తనంతట తానుగా పోలీసుల ముందు లొంగిపోయాడు. రితా చబ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా విద్యార్థి చేతికి తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.