శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (09:53 IST)

యువతిని కిడ్నాప్ చేసి.. కారులో తిప్పుతూ అత్యాచారం...

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ యువతిని కిడ్నాప్ చేసిన నలుగురు కామాంధులు కారులో తిప్పుతూ సామూహిక అత్యాచారం జరిపారు.

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ యువతిని కిడ్నాప్ చేసిన నలుగురు కామాంధులు కారులో తిప్పుతూ సామూహిక అత్యాచారం జరిపారు. హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో శనివారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం..
 
విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన యువతి ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ రోడ్డుపై నడుస్తోంది. ఈ క్రమంలో స్కార్పియో కారులో వచ్చిన నలుగురు యువకులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్‌ను స్విచాఫ్ చేసి నడుస్తున్న కారులోనే ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బల్లభ్‌గఢ్ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు.  
 
తర్వాత ఎలాగోలా ఓపిక తెచ్చుకున్న ఆమె తన ఫోన్‌ను స్విచాన్ చేసి సోదరుడికి సమాచారం అందించింది. అంతకంటే ముందే ఆమెను గమనించిన కొందరు వాహనదారులు పోలీసు కంట్రోల్ రూముకు ఫోన్ చేసి ఆమె గురించి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.