గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 27 డిశెంబరు 2018 (11:18 IST)

పోలీస్ ఇన్‌స్పెక్టర్ కుమార్తె.. అయినా నలుగురి చేతిలో నలిగిపోయింది..

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. యూపీలో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి నమ్మించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని కాన్పూర్‌లో ఉంటున్న ఓ బీటెక్ విద్యార్థికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి(12)తో పరిచయం ఏర్పడింది. 
 
ఈ నేపథ్యంలో సదరు బాలికకు మాయమాటలు చెప్పి తన ఫ్లాట్‌కు రప్పించుకున్న ఆ విద్యార్థి ముగ్గురు స్నేహితులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి పోలీస్ ఇన్‌స్పెక్టర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. స్నేహం పేరుతో మోసం చేశాడని.. సామూహిక అత్యాచారానికి అనంతరం వారి బారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు తెలిపింది.