మధ్యప్రదేశ్‌లో చికెన్ సెంటర్లు మూసివేత
మధ్యప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూతో వందల సంఖ్యలో కాకులు మృత్యువాత పడటంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. మంద్‌సౌర్‌లో 15 రోజుల పాటు చికెన్, గుడ్లు విక్రయించే దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు.
ఒక్క మంద్‌సౌర్‌లోనే బర్డ్‌ఫ్లూ కారణంగా 100 కాకులు చనిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇండోర్‌లో కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ తెలిపారు.
గత డిసెంబర్ 23 నుంచి జనవరి 3 మధ్యలో మధ్యప్రదేశ్‌లో కొన్ని వందల సంఖ్యలో కాకులు మృత్యువాత పడ్డాయి. ఇప్పటికే కేరళలోనూ బర్డ్‌ఫ్లూ జాడలు కనిపించడంతో అక్కడి ప్రభుత్వం దీనిని విపత్తుగా ప్రకటించింది.