1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (07:49 IST)

వెంకయ్యకు కొమొరోస్‌ అత్యున్నత పౌర పురస్కారం

ఆఫ్రికాలోని కొమొరోస్‌లో పర్యటిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుదైన గౌరవం లభించింది. అక్కడి ప్రభుత్వం కొమొరోస్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘ద ఆర్డర్‌ ఆఫ్‌ ద గ్రీన్‌ క్రెసెంట్‌’ ప్రకటించిది. కొమొరోస్‌ అధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా వెంకయ్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. కొమొరోస్‌ పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.  130 కోట్ల మంది భారతీయుల తరఫున దీన్ని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. భారత్‌-కొమొరోస్‌ మైత్రికి గుర్తుగా ‘ద ఆర్డర్‌ ఆఫ్‌ ద గ్రీన్‌ క్రెసెంట్‌’ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.

‘‘సంయుక్త లక్ష్యమే మమ్మల్ని కలిపింది. ఇరుదేశాలను కలిపే సముద్రం కూడా ఒక్కటే. సముద్రమంత స్నేహమిది.  పరస్పర పురోగతికి స్వప్నమిది’’ అని వెంకయ్యనాయుడు చెప్పారు.