మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఢిల్లీ రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. తరలివచ్చిన కేడర్

congress party symbol
ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశ వ్యాప్తంగా నిత్యావసర ధరలు, జీఎస్టీ పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహిస్తుంది. ఇందులో ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఇతర ముఖ్య నేతలు హాజరవుతున్నారు. 
 
ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఆ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో భారీ తరలి వస్తున్నారు. ఈ ర్యాలీ నిర్వహణ సందర్భంగా రామ్ లీలా మైదానలో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటుచేశారు. ఇదులో పాల్గొన్న పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను ఎండగట్టనున్నారు.