టీకాల ఎగుమతులపై నిషేధించాలి : ప్రియాంకా గాంధీ

priyanka
ఠాగూర్| Last Updated: బుధవారం, 21 ఏప్రియల్ 2021 (12:46 IST)
దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్న రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో రోగులకు సరైన వైద్య సదుపాయాలు లేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

అలాంటి వారిలో ప్రియాంకాం గాంధీ ఒకరు. ఆమె కేంద్ర ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలో త‌యారైన వ్యాక్సిన్ల‌ను ముందుగా దేశ ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌కుండా విదేశాల‌కు ఎగుమ‌తి చేస్తుండ‌డం స‌రికాద‌ని అన్నారు. ఆరు నెలల్లో విదేశాలకు 11 లక్షల రెమ్‌డిసివిర్ ఔష‌ధాన్ని ఎగుమతి చేశారని ఆమె విమర్శించారు.

అలాగే, జనవరి నుంచి మార్చి మధ్య ఆరు కోట్ల క‌రోనా వ్యాక్సిన్ల‌ను విదేశాలకు ఎగుమతి చేశారని, దీంతో దేశంలో వాటి కొర‌త ఏర్పడిందని అన్నారు. విదేశాల‌కు వాటిని ఎగుమతి చేయక‌పోతే దేశంలో మ‌రి కొన్ని కోట్ల మంది భారతీయులకు వ్యాక్సిన్లు అందేవ‌ని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం దేశ ప్ర‌జ‌ల‌కు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వ‌ట్లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు.

ప్ర‌ధాని మోదీ ఎన్నికల ర్యాలీల్లో నవ్వుతూ మాట్లాడటం కాదని, ప్రజల ముందుకు వ‌చ్చి, వారి ముందు కూర్చుని మాట్లాడాల‌ని, ప్ర‌జ‌లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. క‌రోనా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో వారి ప్రాణాలను ఎలా కాపాడతారో వారితో చర్చించి నమ్మకం కల్పించాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు.దీనిపై మరింత చదవండి :