గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (17:09 IST)

కర్ణాటకలో రెండు వారాల పాటు లాక్ డౌన్.. 24 కేసుల్లో 34వేల కేసులు

దేశంలో కరోనా కట్టడి కోసం మరో రాష్ట్రం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. కర్ణాటకలో మంగళవారం నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్ విధించారు. గడిచిన 24 గంటల్లో ఏకంగా 34 వేల కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 14 రోజుల పాటు రాష్ట్రంలో కొవిడ్ కర్ఫ్యూ విధిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప వెల్లడించారు. ఈ సందర్భంగా క్లోజ్ డౌన్ అనే పదం ఆయన వాడారు.
 
ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువుల దుకాణాలకు అనుమతి ఇచ్చారు. కర్ఫ్యూ సమయంలో ప్రజా రవాణా ఉండదని కూడా స్పష్టం చేశారు. కేవలం నిర్మాణ, తయారీ, వ్యవసాయ రంగ పనులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఎమర్జెన్సీ అయితే తప్ప రాష్ట్రంలో కానీ, ఇతర రాష్ట్రాలకు కానీ ప్రయాణాలను అనుమతించరు.
 
ప్రజలు దీనికి సహకరించాలని, అలా అయితేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలగని యడ్యూరప్ప అన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కూడా చెప్పారు.