యూపీ టెన్త్ బోర్డ్ ఫలితాల్లో ఆటో డ్రైవర్ కుమార్తె టాపర్, రాష్ట్రంలోనే రెండోస్థానం
కాన్పూర్‌కు చెందిన కిరణ్ కుష్వాహ యూపీ బోర్డ్ హైస్కూల్‌లో 600 మార్కులకు 585 మార్కులు సాధించింది. రాష్ట్ర టాపర్ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్నది.
కిరణ్ తండ్రి సంజయ్ కుమార్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సంజయ్‌కు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వారిలో కిరణ్ చిన్న కుమార్తె. తల్లి రూమా దేవి గృహిణి. కిరణ్ టాప్ ర్యాంక్ రావడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు ఎంతో ఆనందం వ్యక్తం చేసారు.
టపాసులు పేల్చి ఆనందంతో చిందులు వేసారు. దేవుడి దయ వల్లే ఈ విజయం సాధించామన్నారు. తన కుమార్తెను బాగా చదివించాలనుకుంటున్నామని, అయితే ఆర్థిక పరిస్థితి అలా లేదని ఆమె తల్లి రుమా దేవి తెలిపారు.